తెలుగు రాష్ట్రాల్లో కమల్ “విక్రమ్” భారీ విడుదల!

తెలుగు రాష్ట్రాల్లో కమల్ “విక్రమ్” భారీ విడుదల!

Published on May 26, 2022 10:00 PM IST

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విక్రమ్. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది మరియు వార్తల ప్రకారం, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 స్క్రీన్లలో విడుదల కానుంది.

లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో హైదరాబాద్‌ లో జరగనుంది. మరియు కమల్ హాసన్ స్వయంగా ఈ వేడుక కి హాజరు కానున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలు పోషించడంతో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్ 3 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు