‘రాజశేఖర్’ కొత్త సినిమాలో ‘కమల్ హాసన్’ హీరోయిన్

pooja-kumar
తెలుగు పరిశ్రమలో ‘అంకుశం’ వంటి సినిమాతో యాంగ్రీ యాంగ్ మ్యాన్ అన్న బిరుదు సొంతం చేసుకున్న నటుడు ‘డా. రాజశేఖర్’ గత కొన్నాళ్లుగా సరైన సినిమా లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన పోలీస్ పాత్రతోనే తిరిగి వెండి తెరపై మెరవాలని ప్రయత్నిస్తున్నారు. చందమా కథలు, గుంటూరు టాకీస్ వంటి రియలిస్టిక్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ‘ప్రవీణ్ సత్తారు’ త్వరలో తెరకెక్కించబోతున్న సినిమాలో రాజశేఖర్ ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో నటి ‘పూజా కుమార్’ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈమె ‘కమల్ హాసన్’ నటించిన విశ్వరూపం, ఉత్తమ విలన్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ తో చేస్తున్న ఈ సినిమానే ఈమెకు టాలీవుడ్ లో డెబ్యూట్ చిత్రం కానువడం విశేషం. సినిమాలో ఈమె పాత్ర కూడా చాలా సహజ సిద్ధంగా ఉండబోతోందని తెలుస్తోంది.