లెజండ్రీ డైరెక్టర్ తో మరోసారి కమల్ హాసన్.?

లెజండ్రీ డైరెక్టర్ తో మరోసారి కమల్ హాసన్.?

Published on Jul 13, 2015 11:32 AM IST

kamal-hassan-Singeetham-Sri

వారం రోజుల క్రితమే తమిళంలో ‘పాపనాశం’ సినిమా విడుదల చేసిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఆ సినిమాకి అక్కడ విశేష స్పందన రావడంతో కమల్ మరియు అతని టీం చాలా హ్యాపీగా ఉన్నారు. పాపనాశం సక్సెస్ మూడ్ నుంచి పక్కకి వచ్చిన కమల్ హాసన్ అప్పుడే తన తదుపరి సినిమా ‘చీకటి రాజ్యం’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే లెజండ్రీ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావుతో డైరెక్షన్ లో కమల్ తన తదుపరి సినిమా చేయనున్నాడని సమాచారం. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉండేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

కమల్ హాసన్ – సింగీతం శ్రీనివాసరావు మూవీని ఆవారా ఫేం లింగుస్వామి డైరెక్ట్ చేయనున్నాడు. లింగుస్వామి ఉత్తమ విలన్ థియేటర్ రైట్స్ తీసుకున్నాడు. ఆ సినిమా విషయంలో లింగుస్వామికి చాలా వరకూ లాస్ రావడంతో కమల్ తనకి మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో సింగీతం శ్రీనివరరావు – కమల్ హాసన్ కాంబినేషన్ లో పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు, నవ్వండి లవ్వండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు వచ్చాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు