ధనుష్ తో పోటీపడనున్న ఐశ్వర్య !

Published on Dec 4, 2018 5:52 pm IST


తమిళ యువ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నూతన చిత్రం ‘కనా’. మహిళా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీని ఖరారు చేశారు. దాదాపుగా 250 స్క్రీన్ లలో ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలకానుంది. ఇక అదే రోజు ధనుష్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘మారి 2’ కూడా విడుదలకానుందని తెలిసిందే. మరి బాక్సాఫిస్ వద్ద కనా , ఆ చిత్రానికి ఏ రేంజ్ లో పోటీనిస్తుందో చూడాలి.

ఇక ఇటీవల విడుదలైన కనా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండండం తో చిత్రం ఫై మంచి అంచనాలే ఉన్నాయి. అరుణ్ రాజా కామరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ , ఐశ్వర్య కు తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఒక మాములు మధ్య తరగతి అమ్మాయి ఆంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగడానికి ఎలాంటి కష్టాలు పడింది అనే కథ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :