కనా’ తెలుగులో రీమేక్ అవుతుందా ?

Published on Mar 17, 2019 2:43 am IST

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మాణంలో ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ సినిమా కనా. క్రికెట్ న నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్ కు తెలుగు కూడా స్పష్టంగా రావడంతో ఈ రీమేక్ కు కూడా ఆమె నే కొనసాగించనూరున్నారట. కేఎస్ రామారావు , భీమినేని శ్రీనివాస్ రావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ , వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఒరిజినల్ వెర్షన్ కు సంగీతం అందించిన ధిబు నినన్ థామస్ ఈ రీమేక్ కు సంగీతం అందించనున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో ఇది రెండవ సినిమా. ప్రస్తుతం ఆమె , విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More