తేజ “సీత” ఫైట్స్ కూడా చేసిందంటా… !

Published on May 20, 2019 10:15 am IST

బెల్లంకొండ, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ”సీత”.సమ్మర్ కానుకగా ఈ నెల 24 న ఈ మూవీ విడుదల కానుంది. ఈప్పటికే రిలీజ్ ఐన మూవీ ట్రయిలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆత్మగౌరంవం, స్వతంత్ర భావాలు కలిగి జీవితంలో ఏదోసాదించాలన్న లక్షణాలు కలిగిన స్ట్రాంగ్ అమ్మాయిగా కాజల్ నటిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కాజల్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తన అభిమానులలతో పంచుకున్నారు.

ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్స్ చేశారట కాజల్. ‘ఓ సీన్ లో అయితే, రెండు వందల కేజీల ఐస్ గడ్డల్ని మీద వేసుకుని ఫైట్ చేశారట. కొన్ని రియల్ ఫైట్స్ కూడా చేసిందట. అలా ఈ సినిమా కోసం శారీరకంగా కూడా కష్టపడ్డాను అని చెప్పింది కాజల్. ఐతే కాజల్ కష్టానికి తగ్గట్లుగా 3కోట్ల పైనే కాజల్ కి ముట్టచెప్పారట నిర్మాతలు. సోనుసూద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీని ఏ కే ఎంటర్టైన్మెంట్స్ , ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తుండగా , అనూప్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More