కాంచన 3 సెన్సార్ కంప్లీట్ !

కాంచన 3 సెన్సార్ కంప్లీట్ !

Published on Apr 8, 2019 5:27 PM IST

సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాంచన 3. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్డమవుతుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేషన్ తో ఈ చిత్రం తమిళం తోపాటు తెలుగులో ఏప్రిల్ 19న విడుదలకానుంది.

లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వేదిక , ఓవియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు