‘కాంచన 3’ ముందు తేలిపోతున్న ‘జెర్సీ, చిత్రలహరి’ !

Published on Apr 23, 2019 7:45 pm IST

మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ‘కాంచన 3’ ముందు ‘జెర్సీ, చిత్రలహరి’ పోటీలో నిలబడటానికి ఆపసోపాలు పడుతున్నాయి. కొన్ని ఏరియాల్లో అయితే ఏకంగా పోటీలో వెనుకపడిపోయి.. సైడ్ అయిపోతున్నాయి కూడా. ఇందుకు నిదర్సనం.. నిన్న నంద్యాలలో ఈ మూడు సినిమాలకు వచ్చిన కలెక్షన్సే. ‘చిత్రలహరి’ నిన్న నంద్యాలలో 23,394 గ్రాస్.. 10,316 షేర్ ను రాబట్టింది. ఇక జెర్సీ 1,32,105 గ్రాస్ ను, 8,1,531 షేర్ ను రాబట్టింది. కానీ ఈ రెండు స్ట్రేట్ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కంటే.. డబ్బింగ్ సినిమా ‘కాంచన 3’కి వచ్చిన కలెక్షన్సే ఎక్కువ.

‘కాంచన 3’కు గ్రాస్ 2,34,866 రాగా.. 1,65,194 షేర్ వచ్చింది. అంటే నిన్న నంద్యాలలో ‘కాంచన 3’కి చిత్రలహరి కంటే సుమారు ఇరవై రేట్లు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే క్లాసిక్ హిట్, సూపర్ డూపర్ హిట్.. అంటూ ప్రముఖులంతా ముక్త కంఠంతో ప్రశంసల వర్షం కురిపిస్తోన్న ‘జెర్సీ’ కూడా కలెక్షన్స్ విషయంలో ‘కాంచన 3’తో పోటీ పడలేకపోయింది. ‘కాంచన 3’కి వచ్చిన కలెక్షన్స్ లో సగం కూడా జెర్సీకి రాలేదు.

ఈ పరిస్థితి నిన్న ఒక్క రోజే కాదు, ఇప్పటివరకూ నంద్యాలలో ఈ మూడు సినిమాలకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ పరిశీలిస్తే.. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ‘కాంచన 3’ ముందు ‘జెర్సీ, చిత్రలహరి’ తేలిపోయాయి అక్కడ. ఎందుకంటే ఇప్పటివరకూ చిత్రలహరి నంద్యాలలో 11,79,068 గ్రాస్ ను, 7,12,314 షేర్ ను రాబట్టుకుంది. ఇక జెర్సీ 7,36,449 గ్రాస్, 4,99,601 షేర్ ను రాబట్టుకుంది. కానీ ‘కాంచన 3’ మాత్రం ఈ రెండు సినిమాల కంటే ఎక్కువుగా 10,37,551 గ్రాస్ ను మరియు 7,48,353 షేర్ ను సాధించింది. ఈ పరిస్థితి ఒక్క నంద్యాలలోనే కాదు, చాలా ఏరియాల్లో ఇలాగే కొనసాగుతుంది.

కారణం ‘కాంచన 3’ పక్కా కమర్షియల్ అంశాలతో బి.సి సెంటర్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తెరకెక్కడమే. దాంతో మాస్ ఏరియాల్లో ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఓ పక్క స్ట్రేట్ సినిమాల హడావుడితో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా, ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం.. పైగా పెద్ద పెద్ద స్టార్స్ లేకుండానే, పెద్దగా ప్రమోషన్స్ చెయ్యకుండానే బాక్సాఫీస్ వద్ద స్ట్రేట్ తెలుగు సినిమాల కంటే ఎక్కువ ఆదరణ పొందడం.. నిజంగా విశేషమే.

సంబంధిత సమాచారం :