కాంచన 3 లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

Published on May 1, 2019 8:30 am IST

సూపర్ హిట్ ముని సిరీస్ లో భాగంగా రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంచన 3. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నెగటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి డొమెస్టిక్ మార్కెట్ లో ప్రాఫిట్ జోన్ లో ఎంటర్అయ్యింది. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం ఓపినింగ్స్ ను కూడా రాబట్టలేక డిజాస్టర్ట్ అనిపించుకుంది.

ఇక ఈచిత్రం నైజాం లో ఇప్పటివరకు 4. 60 కోట్ల షేర్ ను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి బి సి సెంటర్ల ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక , ఓవియా , నిక్కీ తంబోలి ముఖ్య పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

More