‘కాంచన 3’ ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

Published on Apr 22, 2019 9:52 am IST

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ కాంచన 3 బి. సి కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. అలాగే ‘ఏ’ కేంద్రాలలో కూడా పర్వాలేదనిపించింది. ముని సిరీస్ లో భాగంగా సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం పక్కా మాస్ అంశాలతో సాగడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే ఆదరిస్తున్నారు.

ఇక సినిమాలో రాఘవ లారెన్స్ నటన, కామెడీ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. మొత్తానికి ఫస్ట్ వీకెండ్ లో, కాంచన 3 డిస్టిబ్యూటర్స్ షేర్ కింద 9.13 కోట్ల రూపాయలను రాబట్టుకుంది.

ఏపీ మరియు తెలంగాణ ఫస్ట్ వీకెండ్ షేర్ వివరాలు :

నైజాం – 3.05 కోట్లు
సీడెడ్ – 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.96 కోట్లు
గుంటూరు – 0.85 కోట్లు
తూర్పు గోదావరి – 0.75 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.46 కోట్లు
కృష్ణా – 0.69 కోట్లు

మొత్తం ఏపీ మరియు తెలంగాణ ఫస్ట్ వీకెండ్ షేర్ – 9.13 కోట్లు

సంబంధిత సమాచారం :