సమీక్ష : కాంచన 3 – ‘మాస్ ప్రేక్షకులకు’ మాత్రమే !

Published on Apr 20, 2019 3:04 am IST
Kanchana 3 movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : రాఘవ లారెన్స్, కోవై సరళ, వేదిక, ఓవియా తదితరులు.

దర్శకత్వం : రాఘవేంద్ర లారెన్స్

నిర్మాత : కళానిధి మారన్

సంగీతం : యస్ థమన్

సినిమాటోగ్రఫర్ : వెట్రి

ఎడిటర్ : రుబెన్

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో ముని సిరీస్ లో భాగంగా హారర్ కామిక్ థ్రిల్లర్ గా వచ్చిన కాంచన 3. మరి ఈ సీక్వెల్ తో రాఘవ లారెన్స్ మళ్ళీ హిట్ అందుకున్నాడా.? లేదా.? అన్నది సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

కాళీ (రాఘవ లారెన్స్) తన తల్లి ప్రభావంతో తన జీవితాన్ని ఎదుటివారి కోసమే తాగ్యం చేస్తూ… అంగ వైకల్యం కలిగిన పిల్లల కోసం ఓ ఆశ్రమం నడుపుతుంటాడు. అయితే మినిష్టర్ శంకర్, అతని తమ్ముడు కాళీ ద్వారా ఎనభై కోట్ల డబ్బును సంపాదించాలని ప్లాన్ చేస్తారు. దానికి కాళీ అంగీకరించడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కాళీ చనిపోయి దెయ్యం అయి రాఘవ (రాఘవ లారెన్స్) మీద ఆవహిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత కాళీ ఎవరి మీద తన పగను తీర్చుకున్నాడు ? ఎలా తీర్చుకున్నాడు ? చివరికీ రాఘవను కాళీ వదిలేశాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొత్తానికి భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్ గా తీసుకోని రాఘవ లారెన్స్ ముని సిరీస్ లో భాగంగా వరుసగా సీక్వెల్స్ తీస్తూ హిట్స్ కొడుతున్నాడు. ఇక ఈ జోనర్ లో సినిమా అంటేనే.. కామెడీ, భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా కూడా అలాగే సాగింది. ముఖ్యంగా లారెన్స్ ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అటు భయాన్ని, ఎమోషన్ని కూడా బాగానే పండించాడు.

ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ రాఘవ లారెన్స్ నటనే హైలైట్ గా నిలుస్తోంది.
‌ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన వేదిక, ఓవియా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని హర్రర్ సన్నివేశాల్లో కూడా తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు.

అలాగే తల్లి పాత్రలో నటించిన కోవై సరళ కూడా ఎప్పటిలాగే తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక దర్శకుడిగా రాఘవ లారెన్స్ హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో ప్రేక్షకులని నవ్విస్తాడు. అలాగే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కొన్ని హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందినిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు.

ఇకపోతే కథనం మరియు నేరేషన్ లో ఇంతకు ముందు వచ్చిన కాంచన 1, 2 పార్ట్స్ లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ నే కాంచన 3లో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాల తర్వాత గాని ఆడియన్ అసలు కథలోకి వెళ్ళడు. దీనికి తోడు అక్కడక్కడ తమిళ్ నేటివిటీ సినిమాలో ఎక్కువుగా కనిపిస్తోంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వ పనితనం గురించే.. కొన్ని విసిగించే సీన్స్ ను కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో ముని సిరీస్ లో భాగంగా ‘కాంచన’ సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ప్యూర్ మాస్ ఎంటర్టైనర్. బి,సి సెంటర్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా సాగుతుంది. కాకపోతే రెగ్యులర్ కామెడీ, రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ మరియు ఓవర్ యాక్షన్ తో అక్కడక్కడ ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :