‘కాంచన 3’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Mar 6, 2019 8:33 pm IST

సూపర్ హిట్ ముని సిరీస్ లో నాల్గవ చిత్రంగా రానున్నసినిమా ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తుది దశ షూటింగ్ ను జరుపుకుంటుంది. సన్ పిక్చర్స్ తో కలిసి లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

వేదిక , బిగ్ బాస్ సెన్సేషన్ ఓవియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం మే 1 న తమిళం తో పాటు తెలుగులో విడుదలకానుంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తున్నారు. మరి హార్రర్ థ్రిల్లర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More