కన్నడలో కాంచన 3 !

Published on Apr 27, 2019 7:27 pm IST

రాఘవ లారెన్స్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన చిత్రం కాంచన 3. కాంచనసిరీస్ కు తమిళం తో పాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉండడడంతో ఈ చిత్రం ఇటీవల విడుదలై నెగటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. కేవలం 7రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

ఇక ఈచిత్రం కన్నడ లో విడుదలకానుంది. మే 1న ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక , ఓవియా , నిక్కీ తంబోలి ముఖ్య పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :