కాంచన 3 ట్రైలర్ విడుదలకానుంది !

Published on Mar 26, 2019 2:50 pm IST

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కాంచన 3 షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్డమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈనెల 28న ఉదయం 11 గంటలకు విడుదలచేయనున్నారు. అయితే తెలుగు వెర్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారో లేదో చూడాలి.

సూపర్ హిట్ ముని సిరీస్ లో నాల్గవ చిత్రంగా రానున్న ఈ సినిమా ఫై మంచి అంచనాలు వున్నాయి. లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం తోపాటు తెలుగులో ఏప్రిల్ 19న విడుదలకానుంది.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :