కాంచన హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ !

Published on Apr 21, 2019 10:04 am IST

ముని సిరీస్ కు సీక్వల్ గా తెరకెక్కిన చిత్రం కాంచన 2011 లో తమిళం తో పాటు తెలుగులో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రాన్ని ఇప్పుడు లారెన్స్ హిందీ లో రీమేక్ చేయనున్నాడు. స్టార్ హీరో అక్షయ్ కుమార్ , కియరా అద్వానీ జంటగా నటించనున్న ఈ రీమేక్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి ‘లక్ష్మి’ అనే టైటిల్ ఖరారు చేసారని సమాచారం.

ఇక ఇదిలా ఉంటే మునిసిరీస్ లో భాగంగా తెరకెక్కిన తాజా చిత్రం కాంచన 3 మొన్న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం స్టార్ హీరో సినిమా కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతుంది. దాన్ని బట్టి చెప్పొచ్చు ఈసిరీస్ ఎలాంటి క్రేజ్ ఉందోనని. ఇక తెలుగులో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ నాని జెర్సీ చిత్రానికి గట్టి పోటీనిస్తుంది.

సంబంధిత సమాచారం :