ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తున్న కంగనా?

Published on Jul 15, 2021 12:04 pm IST


బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన కంగనా ఓటిటి లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కంగనా రనౌత్, ఓటిటి ద్వారా కూడా తన సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నారు. అయితే కంగనా చేయబోయే రియాలిటీ షో ఎంతో ఫేమస్ అయిన ఇంగ్లీష్ షో టెంప్టేషన్ ఐ లాండ్ కి ఇండియన్ వర్షన్ అని తెలుస్తోంది.

అయితే కంగనా చేయబోయే ఈ రియాలిటీ షో డేటింగ్ కి సంబంధించినట్లు తెలుస్తోంది. ఇది ఒక డేటింగ్ షో అని దీన్ని ఇండియా లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక దిగ్గజం ఓటిటి నిర్మించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రియాలిటీ షో లో కంగనా వ్యాఖ్యాత గా వ్యవహరించినున్నారు. అయితే ఈ షో కి గానూ కంగనా కి భారీ మొత్తం లో చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి షో చేయడానికి కంగనా తప్ప మరెవరూ లేరు అని సదరు ఓటిటి యాజమాన్యం భావించినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :