ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్.. ఈసారి భారీ లెవల్లో

Published on Jun 24, 2021 12:05 am IST

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ వరుసగా క్రేజీ సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే జయలలిత పాత్రలో ‘తలైవి’ అనే చిత్రం చేస్తున్నారు ఈమె. ఇది పూర్తిగా జయలలిత బయోపిక్. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమా కూడ పూర్తైపోయింది. విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పూర్తయిందో లేదో మరొక సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు కంగనా. ఈసారి ఆమె ఒకప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర ఆధారంగా సినిమా చేస్తున్నారు. అయితే ఇది బయోపిక్ కాదు. కేవలం ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతుందట.

ఈ చిత్రాన్ని కంగనా తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈరోజు నుండే ఇందిరా గాంధీ పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు. ముందుగా మేకప్ కోసం ఫేస్ స్కానింగ్స్ మొదలుపెట్టారు. ఇది బయోపిక్ కాదని గ్రాండ్ పిరియాడిక్ ఫిల్మ్ అని, ఈ పొలిటికల్ డ్రామాతో ఈ తరం వారికి ఈనాటి భారతదేశ రాజకీయ పరిస్థితులు అర్థం అవుతాయని అంటున్నారు కంగనా. ఈ చిత్రం కోసం ఆమె భారీ స్థాయిలో బడ్జెట్ వెచ్చిస్తున్నారు. స్టార్ నటీనట్టులను తీసుకుంటున్నారట. మొత్తానికి కంగనా ఈసారి భారీ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం :