అప్పుడు డ్ర‌గ్స్‌ కు బానిస‌ అయ్యాను – కంగనా రనౌత్‌

Published on Mar 30, 2020 11:00 pm IST

వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుత రోజుల్లో ఇంట్లో ఉండ‌టాన్ని బోర్‌గా ఫీల్ అవ్వొద్దు అని.. చెడ్డ రోజులే మంచి రోజులుగా మారుతాయ‌ని చెప్పుకొచ్చింది. అలాగే ‘నాకు 15 ఏళ్లు వయసులో నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ఆ క్ష‌ణం ఆకాశంలోని న‌క్ష‌త్రాల‌ను నా గుప్పి ట్లో పెట్టుకున్న‌ట్లు ఉద్వేగానికి లోన‌య్యాను. పైగా రెండు సంవ‌త్స‌రాల్లోనే నేను స్టార్‌న‌య్యాను కూడా. కానీ ఆ సమయంలో డ్ర‌గ్స్‌ కు బానిస‌ని అయ్యాను. అయితే ఆ తరువాత నాకు ఇష్టమైన వ్యక్తుల సాయంతో నేను డ్రగ్స్ నుండి బయటపడ్డాను’ అని కంగనా తెలిపింది.

ఇక తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్ లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. మరి కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :