‘తలైవి’కి కంగనా రనౌత్ నివాళి..!

Published on Dec 5, 2019 8:03 pm IST

వెండి తెరపై ధ్రువ తారగా వెలిగి… రాజకీయ సంచలనంగా మారిన జయలిత జీవితంలో ఎన్నో మలుపులు, ఆసక్తికర ఘటనలు వున్నాయి. ఆమె మరణంగా కూడా ఒకింత రహస్యమనే వాదనలు ఉన్నాయి. ఏదిఏమైనా జయలలిత ఈ లోకాన్ని విడిచి వెళ్లి మూడు సంవత్సరాలు అవుతుంది. 2016 డిసెంబర్ 5న ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలితగా ‘తలైవి’ అనే టైటిల్ తో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకాగా తలైవి సినిమాలో జయలలితగా కంగనా లుక్ మరియు చిన్న ప్రోమో వీడియో విడుదల చేశారు. నేడు జయలలిత వర్ధంతిని పురస్కరించుకొని కంగనా ఆమెకు నివాళులు సమర్పించారు. జయలలిత చిత్ర పటానికి పూల మాలలు వేసి సంతాపం ప్రకటించారు. దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. కంగనా ను జయలలితగా చూపించడానికి హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్స్ పనిచేయడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

X
More