క్రిష్ తీసిన సీన్స్ నే తొలిగించేస్తోన్న హీరోయిన్ ?

kangana ranauat
స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన చిత్రం ‘మణికర్ణిక’. పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే కంగ‌నాకు, క్రిష్ కు మ‌ధ్య విభేదాలు వచ్చాయని, అందుకే కంగనానే డైరెక్షన్ చేస్తుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

వాస్తవానికి ‘మణికర్ణిక’ మొదలైన దగ్గర నుండే స్క్రిప్ట్ విషయంలోగాని, కంగనా వస్త్రాలంకరణ విషయంలో గాని, క్రిష్ కి కంగనాకి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని.. అవి పెరిగడం వల్లే.. క్రిష్ సినిమా నుండి తప్పుకున్నారని బాలీవుడ్ మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు ప్రకారం ఇక ఇరవై శాతం షూటింగ్ ఉందనగానే క్రిష్ మణికర్ణిక చిత్రం వదిలేశారట.

అయితే మిగిలిన ఆ ఇరవై షూటింగ్ ను కంగనానే డైరెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఆమె అంతటితో ఆగక, ఏకంగా క్రిష్ తీసిన కొన్ని సన్నివేశాలనే తొలగించింది. ఆ సన్నివేశాల్లోనే సోనూ సూద్‌ మల్లయుద్ధంకి సంబంధించిన సీన్స్ ఉన్నాయి, వాటిని అనవసరంగా తొలిగించారనే ఉద్దేశ్యంతోనే సోనూ సూద్‌ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని టాక్. కాగా సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది .

Exit mobile version