స్టార్ జంట పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ‘స్టార్ హీరోయిన్’ !

Published on Mar 28, 2019 4:30 pm IST

ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది కంగనా రనౌత్‌. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ కి చెందిన స్టార్ డమ్ ఉన్న ఓ యువ జంట పై కూడా తన శైలి బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయింది. ఇటీవలే స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా ఇప్పుడు మళ్లీ ఆలియాతో పాటు ఆలియా బాయ్‌ఫ్రెండ్‌ స్టార్ హీరో రణ బీర్‌ పై కూడా కామెంట్స్ చేసింది.

ఆలియాకి 27 సంవత్సరాలు వచ్చినా, అలాగే రణ్‌బీర్‌ కి 37 సంవత్సరాలు వచ్చినా… వాళ్ళను ఇంకా యువ జంట, యువ నటులు అని పిలవడం ఏమి బాగాలేదని.. ఇలా పిలుస్తూ జనాల పై తప్పుడు అభిప్రాయాలను రుద్దుతున్నారని.. నిజానికి ఆలియా వయసులో మా అమ్మకు ముగ్గురు పిల్లలున్నారని కంగనా కామెంట్స్ చేసంది.

సంబంధిత సమాచారం :

More