ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానంటున్న స్టార్ హీరోయిన్ !

Published on Mar 3, 2019 12:27 pm IST

ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయం గురించి మీడియాతో పంచుకుంది. ‘‘నేను ప్రేమలో లేని రోజంటూ లేదు. నా జీవితంలో ప్రేమ విషయంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా. కానీ వాటి నుంచి వెంటనే బయటపడిపోయాను. ఇప్పుడు నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పుకొచ్చింది కంగనా.

కాగా ఇటీవలే కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా తెరకెక్కిన ‘మణికర్ణిక’ బాగానే హిట్ అయింది. ఇక ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’లో కంగనా రనౌత్‌ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More