జయలలిత గా కంగనా లేటెస్ట్ లుక్ సూపర్..!

Published on Feb 24, 2020 10:11 am IST

తమిళ రాజకీయ సంచలనం, ప్రజల ఆరాధ్య దైవం జయలలిత జయంతి నేడు. ఈ సందర్భంగా తలైవి చిత్రంలోని కంగనా లుక్ విడుదల చేశారు. సినిమాల నుండి రాజకీయాల వైపు జయలలిత మరలిన దశకు సంబందించిన ఆ లుక్ చాలా బాగుంది. కంగనా తాజా లుక్ జయలలితకు చాలా దగ్గరగా సరిపోయింది. జయలలిత పాత్ర కోసం కంగనా చాలా కష్టపడుతున్నారు. షూటింగ్ కి ముందే ఆమె డాన్స్ మరియు గుర్రపు స్వారీ వంటివాటిలో శిక్షణ తీసుకున్నారు.

తలైవి చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది. తలైవి చిత్రానికి సంగీతం జి వి ప్రకాష్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More