క్రిష్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన కంగనా సిస్టర్ !

క్రిష్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన కంగనా సిస్టర్ !

Published on Jan 28, 2019 6:47 PM IST

kangana sistrs

పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట
దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించినా ఆ తరువాత ఆయనకు, కంగనా రనౌత్ కు మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు కారణంగా క్రిష్ ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నారు.

కాగా ఈ విషయం పై క్రిష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మణికర్ణిక సినిమాని తానే దర్శకత్వం వహించానని, అయిన కంగనా మళ్లీ కొన్ని సన్నివేశాలు రీషూట్ చేసిందని.. కంగనా పై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే క్రిష్ వ్యాఖ్యల పై కంగనా సిస్టర్ రంగోలి స్పందిస్తూ.. ‘డైరెక్టర్ క్రిష్.. మీరే డైరెక్ట్ చేశారు. ఫస్ట్ ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకంటే మణికర్ణిక సినిమాకు లీడింగ్ ఫేస్ ఓన్లీ కంగనానే. మణికర్ణిక విజయాన్ని, ప్రశంసల్ని కంగనాను ఆస్వాదించనివ్వండి’ అని ట్వీట్ చేసింది.

తాజా వార్తలు