సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ‘జయలలిత’ జీవిత చరిత్ర ఆధారంగా తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తీసిన బయోపిక్ ‘తలైవి’. రీసెంట్ గా ఈ సినిమా నుంచి కొన్ని స్టిల్స్ ను వదలడం, అవి కాస్త వైరల్ అవడం తెలిసిందే. కంగనా, అరవింద్ స్వామి కలయికలో వచ్చిన ఈ స్టిల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ బయోపిక్ బడ్జెట్ 150 కోట్లు అట. కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది.
అలాగే అమ్మ బయోపిక్ కాబట్టి, తమిళంలో కూడా ఈ సినిమాకి భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చేశారు. ఇప్పుడు తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమాకి మార్కెట్ పరంగా బాగా కలిసొచ్చేలా ఉంది. కాగా ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది.
జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ముఖ్యంగా కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.


