‘తలైవి’ని ఎడిటింగ్ చేయిస్తోన్న కంగనా ?

‘తలైవి’ని ఎడిటింగ్ చేయిస్తోన్న కంగనా ?

Published on Dec 6, 2020 4:00 AM IST

తమిళ డైరెక్టర్ ఎ.ఎల్‌.విజ‌య్ దర్శకత్వంలో దివంగత నేత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది, ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ జరుగుతుందని.. కంగనానే దగ్గర ఉండి మరి ఎడిటింగ్ చేయిస్తుందని.. అలాగే ఎవరి క్యారెక్టర్ ఎంత సేపు ఉండాలి అనే విషయం కూడా ఆమె డిసైడ్ చేస్తోందట.

మొత్తానికి కంగనా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది. పైగా సినిమాలో మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు