ఘనంగా ‘కన్న’ మూవీ టీజర్ లాంచ్

ఘనంగా ‘కన్న’ మూవీ టీజర్ లాంచ్

Published on Apr 25, 2026 6:00 AM IST

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘కన్న’ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మాధురి సమర్పణలో ప్యాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో పతాకాలపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎన్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. కార్తీక్ శివన్, గీతికా రథన్ జంటగా నటించిన ఈ మూవీ టీజర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన యువ హీరో చైతన్య రావు విడుదల చేశారు.

​ఈ సందర్భంగా చైతన్య రావు మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే మలయాళ సినిమా చూసిన అనుభూతి కలిగిందని, విజువల్స్, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. క్రికెట్, లవ్, ఎమోషన్స్ ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా రూపొందిందని హీరో కార్తీక్ శివన్ తెలిపారు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా, ప్రతీ ఊరిలో ఉండే ఒక కుర్రాడి కథతో సరదాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్ గీతికా రథన్ ‘సత్య’ అనే కీలక పాత్రలో మెప్పించనున్నారు.

​సిరివిరెడ్డి నరసింహారెడ్డి, ఎడమ శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తుండగా, గుణశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా, కోడటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ‘కన్న’ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

తాజా వార్తలు