చంద్రశేఖర్ యేలేటి సినిమాలో కన్నడ సూపర్‌స్టార్!

చంద్రశేఖర్ యేలేటి సినిమాలో కన్నడ సూపర్‌స్టార్!

Published on Oct 28, 2015 6:58 PM IST

yeleti-chandrasekhar
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిది ఓ ప్రత్యేక శైలి. ప్రయోగాత్మక సినిమాలను కమర్షియల్‌గానూ వర్కవుట్ అయ్యేలా చేస్తూ ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, సాహసం లాంటి వినూత్న సినిమాలను అందించిన యేలేటి తాజాగా ఓ బహుభాషా సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందనున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఇక తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఈ సినిమా కన్నడ వర్షన్‌లో మోహన్ లాల్ స్థానంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్‌ను నటింపజేస్తున్నారు. శివ రాజ్ కుమార్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కిల్లింగ్ వీరప్పన్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఓ ఫ్యామిలీ ఓరియంటడ్ కథాంశంతో సరికొత్త నెరేషన్‌తో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్‌లతో పాటు బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ లాంటి స్టార్స్ నటిస్తోన్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమా అనౌన్స్ అయినరోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

తాజా వార్తలు