మెగాస్టార్ ‘సైరా’ కన్నడ వెర్షన్ ఇంత కాస్ట్లీ నా…!

Published on Jun 30, 2019 11:09 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక ” సైరా” ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. మిగిలిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా పూర్తి చేసి ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబర్2న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా రిలీజ్ కానుంది.

కాగా సైరా కన్నడ వెర్షన్ హక్కుల గురించి ఓ సెన్సేషన్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను దాదాపు 30 కోట్లకు పైగా ధర చెల్లించి కన్నడ హక్కులను సొంతం చేసుకుందట. ఒక డబ్బింగ్ మూవీకి ఇంత రేటంటే మాటలుకాదు. దానికితోడు తెలుగు సినిమాలకు కన్నడ మార్కెట్ మరీ అంత పెద్దదేమీ కాదు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో వస్తున్న సైరా సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తుండగా అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపై బాబు వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సైరాలో హీరోయిన్స్ గా నయనతార,తమన్నా నటిస్తుండగా,అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

సంబంధిత సమాచారం :

More