“కాంతారా” హిందీ లేటెస్ట్ వసూళ్లు డీటెయిల్స్ ఇవే.!

“కాంతారా” హిందీ లేటెస్ట్ వసూళ్లు డీటెయిల్స్ ఇవే.!

Published on Oct 28, 2022 3:00 PM IST

ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ లో భారీ సక్సెస్ ని చూసిన చిత్రాల్లో కన్నడ నుంచి వచ్చిన మరో భారీ హిట్ చిత్రం “కాంతారా” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటించగా ఈ డివోషనల్ హిట్ ని అయితే తానే దర్శకత్వం వహించాడు. అలాగే సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం అయితే హిందీలో అదే భారీ సక్సెస్ ని కొనసాగిస్తోంది.

సినిమా రెండో వారంలోకి వచ్చి కంప్లీట్ అయ్యినా కూడా సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తుంది. మరి ఈ బుధవారం నుంచి వసూళ్లు మరింత పెరగగా ఈ గురువారం కూడా అంతే వసూళ్లు అందుకోవడంతో ఈ చిత్రం 31.7 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది. ఇప్పటికీ కూడా ఇదే స్ట్రాంగ్ రన్ ఈ సినిమా కొనసాగిస్తుండడంతో అయ్యితే అయితే ఈ చిత్రం డెఫినెట్ గా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని సింపుల్ గా అందుకుంటుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు