హిందీలో ఈ వీకెండ్ “కాంతారా” సాలిడ్ డామినేషన్.!

హిందీలో ఈ వీకెండ్ “కాంతారా” సాలిడ్ డామినేషన్.!

Published on Nov 6, 2022 4:15 PM IST

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా అలాగే రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ బ్లాక్ బస్టర్ చిత్రం “కాంతారా”. ఈ చిత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో వసూళ్లు తెలుగు సహా హిందీలో కనబరుస్తుండగా ఇక ఈ చిత్రం అయితే హిందీ లేటెస్ట్ వసూళ్లు తెలుస్తున్నాయి. ఈ చిత్రం ఈ వీకెండ్ లో కూడా గట్టి వసూళ్లే కొల్లగొట్టినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రం కొత్త సినిమాల రిలీజ్ ఉన్నప్పటికీ హిందీలో హైయెస్ట్ నంబర్స్ ఈ శనివారం నమోదు చేసిందట. మరి ఈ శనివారం ఈ చిత్రం 3.25 కోట్లు నమోదు చేయగా ఇతర రీసెంట్ సినిమాలు అన్నీ కూడా దీని కన్నా తక్కువే రిజిస్టర్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని బట్టి హిందీలో కాంతారా డామినేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇదే కొనసాగితే డెఫినెట్ గా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో కూడా చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు