ఆ రెండు భాషల్లో “కాంతారా” థియేట్రికల్ రిలీజ్.!

Published on Mar 19, 2023 7:02 am IST

కన్నడ సినిమా దగ్గర ఎంతో ప్రైడ్ గా నిలిచిన చిత్రాలలో “కాంతారా” కూడా ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో డివోషనల్ హిట్ గా అయితే నిలిచింది. మరి ఈ భారీ హిట్ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ కూడా తెరకెక్కనుండగా సినిమా నిర్మాణ సంస్థ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు.

ఈ సినిమాని అతి త్వరలోనే స్పానిష్ మరియు ఇటాలియన్ విదేశీ భాషల్లో అయితే థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో ఇప్పుడు ఈ భాషల్లో కాంతారా రిలీజ్ ఆసక్తి గా మారింది. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు అలాగే హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :