తండ్రి బయోపిక్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూతురు !

Published on Mar 26, 2019 8:07 pm IST

లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం 83. ఖబీర్‌ ఖాన్‌ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో స్టార్ హీరో రణ్వీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనుండగా తమిళ హీరో జీవా వెటరన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రానికి కపిల్ దేవ్ కుమార్తె అమియా దేవ్ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం విశేషం.

ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మే 15 నుండి లండన్ లో మొదలు కానుంది. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో విష్ణు ఇందూరి , మధు వంతెన , ఖబీర్ ఖాన్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రం 2020 ఏప్రిల్ 10న హిందీతో పాటు తెలుగు , తమిళ బాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More