ఓటిటిలో రానున్న బిగ్ బాస్ కి హోస్ట్ ఎవరంటే?

Published on Jul 27, 2021 10:09 pm IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సారి బిగ్ బాస్ సరికొత్తగా సన్నాహం అవుతుంది. ఈ సారి బిగ్ బాస్ డైరెక్ట్ ఓటిటి గా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. హిందీ లో ఈ బిగ్ బాస్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే ఈ సారి బిగ్ బాస్ కి వ్యాఖ్యాత గా కరణ్ జోహార్ వ్యహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. కరణ్ జోహార్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ వూట్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. బిగ్ బాస్ లోగో ను సైతం యాజమాన్యం తాజాగా మార్చిన సంగతి తెలిసిందే.

అయితే టాలీవుడ్ లో సైతం ఈ బిగ్ బాస్ షో సిద్దం అవుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. హోస్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇంకా కంటిస్తెంట్ ల కి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :