‘మిరాయ్’ హిందీ వెర్షన్‌కు కరణ్ జోహర్ అండదండలు..!

‘మిరాయ్’ హిందీ వెర్షన్‌కు కరణ్ జోహర్ అండదండలు..!

Published on Aug 14, 2025 5:59 PM IST

Miraii

యంగ్ హీరో తేజ సజ్జా ‘హను-మాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు పొందాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో అతను ప్రస్తుతం మరో సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. ‘మిరాయ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాను కూడా పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి హిందీ రైట్స్‌ను బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ దక్కించుకున్నారు. మంచి ఫ్యాన్సీ రేటుకు ఆయన ఈ చిత్ర హిందీ రైట్స్ దక్కించుకున్నారని.. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను ఉత్తరాదిన రిలీజ్ చేస్తుందని బి టౌన్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తతో మిరాయ్ చిత్రం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే, కరణ్ జోహర్ లాంటి ఫిల్మ్ మేకర్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారా అని అందరూ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు