యష్ సినిమాలో కరీనా? లేటెస్ట్ క్లారిటీ

యష్ సినిమాలో కరీనా? లేటెస్ట్ క్లారిటీ

Published on Mar 19, 2024 1:06 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా ఇప్పుడు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “టాక్సిక్” (Toxic Movie) కోసం తెలిసిందే. మరి రెండు భారీ పాన్ ఇండియా హిట్స్ చిత్రాలు “కేజీయఫ్” (KGF) సిరీస్ అనంతరం యష్ నుంచి ఎలాంటి సినిమా ఉంటుందా అనే సమయంలో ఈ చిత్రాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక దీని అనౌన్సమెంట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు సెట్ అవ్వగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి కరీనా (Kareena Kapoor) కపూర్ కూడా ఉన్నట్టుగా కొన్ని రూమర్స్ ఆ మధ్య వచ్చాయి. అయితే తర్వాత యష్ ఇది సహా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) రూమర్స్ పై మాట్లాడుతూ సినిమాపై ఏమన్నా అప్డేట్ ఉంటే తాము స్వయంగా అందిస్తామని కౌంటర్ ఇచ్చాడు.

మరి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కరీనా ప్రెజెన్స్ పై సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ తాను సౌత్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా కన్ఫర్మ్ చేసింది. దీనితో ఇది వరకే ఆల్రెడీ టాక్సిక్ సినిమాలో ఆమె ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె కూడా ఓ సినిమాని కన్ఫర్మ్ చేయడంతో దాదాపు యష్ సినిమాలో ఆమె ఉన్నట్టే ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు