‘కర్మణ్యే వాధికారస్తే’ చిత్రం ఓటీటీలోకి.. సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్

‘కర్మణ్యే వాధికారస్తే’ చిత్రం ఓటీటీలోకి.. సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్

Published on Nov 23, 2025 7:00 AM IST

Karmanye Vadhikaraste

‘కర్మణ్యే వాధికారస్తే’ చిత్రం ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో, డి.ఎస్.ఎస్. దుర్గా ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించగా, బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధ ముఖ్య పాత్రలు పోషించారు.

అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మాట్లాడుతూ, థియేటర్‌లో సినిమాను చూడలేని ప్రేక్షకులు ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో చూసి సినిమాను ఆస్వాదించాలని కోరారు. నిర్మాత డి.ఎస్.ఎస్. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తమ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 100 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఓటీటీలోనూ తప్పక చూడాలని విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు