అడ్డాల చేతికి మరొక రీమేక్ వెళ్లిందా ?

Published on May 20, 2021 3:00 am IST

ఫ్యామిలీ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి పెద్ద స్టార్ హీరోలను పెట్టుకుని కూడ ఫ్యామిలీ కథలే చేసే స్టైల్ ఆయనది. అలాంటి శ్రీకాంత్ అడ్డాల తమిళ హిట్ మూవీ ‘అసురన్’ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. అడ్డాల ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తారని కూడ ప్రేక్షకులు ఊహించలేదు. కానీ చేశారు. ఈ ‘నారప్ప’ గనుక హిట్ అయితే అడ్డాలలోని కొత్త కోణం బయటపడుతుంది. రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అవుతారాయన.

ఇండస్ట్రీలో అయితే శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’ను చాలా బాగా డీల్ చేశారనే టాక్ ఉంది. అందుకే ఇంకొక తమిళ రీమేక్ ఆయన వద్దకు వెళ్లినట్టు టాక్ వినబడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తమిళంలో ఇటీవల విడుదలై మంచి పేరు తెచ్చుకున్న ‘కర్ణన్’ రీమేక్ హక్కులు కొనుగోలు చేశారు. ఈ రీమేక్ ను చేసే బాధ్యతను అడ్డాలకు అప్పగించాలని అనుకుంటున్నారట ఆయన. మరి అడ్డాల వరుసగా రెండవసారి రీమేక్ చేయడానికి ఓకే చెప్తారో లేకపోతే ‘నారప్ప’ ఫలితం చూశాక నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :