విడుదలైన ‘కర్త కర్మ క్రియ’ ఫస్ట్ లుక్ !

విడుదలైన ‘కర్త కర్మ క్రియ’ ఫస్ట్ లుక్ !

Published on Sep 5, 2018 2:00 PM IST

karthakarmakriya1

‘బిచ్చగాడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ ఈసారి నేరుగా తెలుగు చిత్రాన్ని నిర్మిస్తుంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న తెలుగు స్ట్రయిట్ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

‘కర్త కర్మ క్రియ’ అనే టైటిల్ తో ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈఫస్ట్ లుక్ విడుదల సందర్బంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ. “మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసేలా ఉంటుంది.. “కర్త కర్మ క్రియ” అనే వైవిధ్యమైన టైటిల్ ను ఈ సినిమాకు ఎంచుకుని ఈ రోజు రివీల్ చెస్తున్నాము.

యధార్థ సంఘటనల ఆదారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సస్పెన్సు థ్రిల్లర్ గా రానున్న ఈచిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకులముందుకు తీసుకురన్నారు.

తాజా వార్తలు