‘కర్త కర్మ క్రియ’ ట్రైలర్ విడుదల !

‘కర్త కర్మ క్రియ’ ట్రైలర్ విడుదల !

Published on Nov 3, 2018 11:16 AM IST

kartha karma kriya

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తొన్న కర్త క్రియ కర్మ సినిమా ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. “వీకెండ్ లవ్” ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. నవంబర్ 8న చిత్రాన్ని విడుదల చెస్తాము‌. మా సూపర్ హిట్ చిత్రం బిచ్చగాడు తరహాలొ నాగు గవర “కర్త కర్మ క్రియ” సక్సెస్ కావాలన్నారు.

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కధ ఇది. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. హీరొ హీరొయిన్ లు కొత్త వారైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్ గా అంతే ఉత్తమంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తీశాము. మా టీమ్ అందరికీ పేరొస్తుందన్న నమ్మకముందన్నారు.

సినిమా హీరొ హీరోయిన్ వసంత్ సమీర్, సెహర్ ఈ సినిమా లొ అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, భాస్కరభట్ల రవి కుమార్, కాదాంబరి కిరణ్ , రవి వర్మ, చంద్రమహేష్ , కాశీ విశ్వనాథ్, లొహిత్, శ్రీ హర్ష సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయిదాపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు