షూటింగ్ పూర్తి చేసుకున్న దేవ్ !

Published on Dec 26, 2018 7:32 pm IST

ఈ ఏడాదిలో ‘కడై కుట్టి సింగం’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకొన్నాడు తమిళ హీరో కార్తీ. ఇక ఈ చిత్రం తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దేవ్’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నూతన దర్శకుడు రజత్ రవి శంకర్ తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా గా లో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతికి ఈ చిత్రం యొక్క ఆడియో విడుదలకానుంది.

50కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం తమిళ్ తో పాటు తెలుగులో వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదలకానుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈచిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :