కార్తి ‘ఖైదీ’ టీజర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on May 25, 2019 1:00 am IST

తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ’. కాగా ఈ చిత్రం తెలుగులో వేరే పేరుతో విడుదల కానుంది. అయితే ఆ టైటిల్ ఏంటా అని ఇంకా రివీల్ చేయలేదు చిత్రబృందం. తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ టీజర్ ను ఈ నెల 30న విడుదల అవ్వబోతుందని చిత్రబృందం తెలిపింది.

అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదట. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ డిఫరెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక కార్తి ఈ సినిమాతో దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More