కార్తి కొత్త సినిమా షురూ !

Published on Apr 27, 2019 12:47 pm IST

కడైకుట్టి సింగంతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి కి దేవ్ షాక్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కార్తి కెరీర్ లోనే డిజాస్టర్ సినిమా మిగిలిపోయింది. ఇక ఈ చిత్రం తరువాత కార్తి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ అనే చిత్రం ఒకటి. ఈసినిమా తుది దశకు చేరుకుంది.

ఇక ఈచిత్రంతో పాటు కార్తి దృశ్యం ఫేమ్ జీతూ జోసఫ్ డైరెక్షన్ లో నటించడానికి ఒకే చెప్పాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఈచిత్రంలో జ్యోతిక , సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. 96ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. వయాకామ్ 18స్టూడియోస్ , పారలాల్ మైండ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదలకానుంది. ఈరెండు సినిమాలతో పాటు కార్తి , రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ తో ఓ సినిమా చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :