విడుదల తేదీ : సెప్టెంబర్ 10 , 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : కార్తీ, మాళవిక మోహనన్, ఎస్ జే సూర్య, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్ మరియు ఇతరులు
దర్శకత్వం : P. S. మిత్రన్
నిర్మాత : S. లక్ష్మణ్ కుమార్
సంగీతం : సామ్ సి.ఎస్
ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్
కూర్పు : విజయ్ వేలుకుట్టి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ లు ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ సీక్వెల్ సినిమానే ‘సర్దార్ 2’. పార్ట్ 1 మంచి హిట్ కావడంతో దాని సీక్వెల్ ని ఇప్పుడు తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఈసారి కథ అంతా భారతదేశాన్ని నాశనం చేయగలిగే ఆపరేషన్ డోకు పై కనిపిస్తుంది. అయితే దీని ప్రభావాన్ని భారత్ ఎలాగో మొదట అడ్డుకుంటుంది కానీ బ్లాక్ డాగర్ (ఎస్ జే సూర్య) మళ్ళీ దీన్ని యాక్టీవ్ చేస్తాడు. ఇక దీనితో ప్రభావం మరింత ఉదృతం అవుతుంది. ఇక దీనిని అడ్డుకునేందుకు భారత రా ఏజెంట్స్ అయినటువంటి సర్దార్ (కార్తీ) అలాగే తన కొడుకు విజయ్ ప్రకాష్ (కార్తీ) సహా ఇతర ఏజెంట్స్ కలిసి ఏం చేశారు? అసలు ఈ ఆపరేషన్ డాకు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? అది భారత్ కి ఎలా ముప్పును తలబెడుతుంది? ఈ క్రమంలో తండ్రీకొడుకులు సర్దార్, విజయ్ లు చేసిన సాహసాలు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
గత సినిమాలో లానే ఈసారి కూడా ఓ సెన్సిటివ్ సబ్జెక్ట్ ని దర్శకుడు పట్టుకోవడం జరిగింది. అలాగే దీనిపై కొన్ని సీన్స్ అలానే ఇచ్చిన సందేశం కూడా ఓకే అనిపిస్తుంది. ప్రస్తుత ప్రపంచానికి దగ్గరగా ఈ పాయింట్ అయితే కనిపిస్తుంది.
ఇక హీరో కార్తీ మరోసారి షైన్ అయ్యారని చెప్పొచ్చు. పార్ట్ 1 హిట్ కి కారణాల్లో కంటెంట్ తో పాటుగా డ్యూయల్ రోల్ లో కార్తీ పెర్ఫామెన్స్ కూడా ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి తండ్రీ కొడుకులుగా కార్తీ రెండు షేడ్స్ లోను సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు.
అలాగే కొన్ని కీలక ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా తనపై బాగున్నాయి. ఇక తనతో పాటుగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్, ఎస్ జే సూర్యలు తమ పాత్రల్లో బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్:
పార్ట్ 1 చూసిన ఏ ఒక్కరికి అయినా పార్ట్ 2 అంటే డెఫినెట్ గా అంచనాలు డబుల్ ఉంటాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో మాత్రం మాత్రం సర్దార్ 2 విఫలం అయ్యింది. పార్ట్ 1 లో ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్, మూమెంట్స్ పార్ట్ 2 లో బాగా మిస్ అయ్యాయి.
ఇంట్రెస్టింగ్ గా కొన్ని ఐడియాలు పార్ట్ 2 లో బాగానే ఉన్నాయి కనిపిస్తుంది కానీ వాటికీ తగ్గ సెటప్, స్క్రీన్ ప్లే మిస్ అయినట్టు కూడా చూసే ఆడియెన్ కి అర్ధం అయ్యిపోతుంది. అలాగే పార్ట్ 2 కోసం మేకర్స్ గ్రాండ్ స్కేల్ ని అయితే ఎంచుకున్నారు కానీ కంటెంట్ ని తెరకెక్కించే క్రమంలో మాత్రం గాడి తప్పారని చెప్పక తప్పదు.
అలాగే సెకండాఫ్ లో ఓ కామెడీ సీన్ ఉంటుంది. ఎస్ జే సూర్య, యోగి బాబు మరియు నిళల్గల్ రవిలపై ఈ సీన్ ఫన్ గానే ఉంటుంది కానీ మరీ ఇలాంటి పరిజ్ఞానం తక్కువ ఉన్న వ్యక్తులని రా ఏజెంట్లుగా ఎలా తీసుకుంటారు అనే లాజికల్ ప్రశ్న కూడా మదిలో మెదలొచ్చు.
ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే కనిపిస్తాయి. దీనితో ఒక స్పై సినిమాకి కావాల్సిన పొటెన్షియల్ ఇందులో మిస్ చేశారు. ఇక సెకండాఫ్ కూడా సాగదీతగా అనిపిస్తుంది. ఎక్కువ నిడివితో తక్కువ థ్రిల్ మూమెంట్స్ తో దీన్ని నడిపించి బోర్ కొట్టించారు.
సాంకేతిక వర్గం:
ఈసారి నిర్మాణ విలువలు మాత్రం మరింత గ్రాండ్ గా ఉన్నాయి. కానీ ఈసారి సామ్ సి ఎస్ సంగీతం మాత్రం అంత రేంజ్ లో ఆకట్టుకోలేదు. జార్జ్ విలియమ్స్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ తగ్గించాల్సింది.
ఇక దర్శకుడు పి ఎస్ మిత్రన్ విషయానికి వస్తే.. పార్ట్ 1 లానే పార్ట్ 2 లో కూడా ఒక సోషల్ ఎలిమెంట్ ని తాను పట్టుకున్నారు కానీ మొదట్లో నడిపించినట్టుగా ఈసారి కథనాన్ని రేసిగా, గ్రిప్పింగ్ గా నడిపించడంలో తడబడ్డారు. కొన్ని సీన్స్ వరకు ఓకే కానీ ఖచ్చితంగా పార్ట్ 1 ని మించి అయితే ఈసారి తన వర్క్ కనిపించలేదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకుంటే ‘సర్దార్ 2’ మాత్రం పార్ట్ 1 తో పోలిస్తే అంచనాలు అందుకోలేకపోయింది. కార్తీ నటుడుగా మరోసారి సాలిడ్ పెర్ఫామెన్స్ చేసాడు. అలాగే సబ్జెక్టులో కోర్ పాయింట్ కూడా బాగానే ఉంది కానీ ఇవే ఎలిమెంట్స్ పార్ట్ 1 లో కూడా ఉన్నప్పటికీ అక్కడ కనిపించిన గ్రిప్పింగ్ కథనం, థ్రిల్ మూమెంట్స్ ఇందులో బాగా మిస్ అయ్యాయి. సో వీటితో ఈ చిత్రం ఒక డల్ స్పై థ్రిల్లర్ గా నిలిచిపోయింది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


