ఎట్టకేలకు పండగకే వస్తున్న కార్తీ ‘వా వాతియార్’.. కానీ..!

ఎట్టకేలకు పండగకే వస్తున్న కార్తీ ‘వా వాతియార్’.. కానీ..!

Published on Jan 10, 2026 6:33 PM IST

Vaa Vaathiyaar

తమిళ హీరో కార్తీ నటించిన ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar)సినిమా మొదట డిసెంబర్ 12న బాలకృష్ణ ‘అఖండ 2’తో పాటు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా తలెత్తడంతో సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. నిర్మాత సంస్థ స్టూడియో గ్రీన్ పై పాత బాకీల విషయంలో కేసు నమోదవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారి, విడుదలను నిలిపివేయాల్సి వచ్చింది.

ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ‘వా వాతియార్’ను సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇక తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఒకేసారి విడుదల అవుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే టాలీవుడ్ బాక్సాఫీస్ నేరుగా వచ్చిన సినిమాలతో నిండిపోయి ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, రాజ్‌కిరణ్, సత్యరాజ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు