బాహుబలి కోసం పాటపాడిన కార్తీక్

బాహుబలి కోసం పాటపాడిన కార్తీక్

Published on Feb 26, 2015 10:01 PM IST

karthik
హ్యపీ డేస్ సినిమాలో ‘అరెరె అరెరే’ వంటి యుగళగీతంతో యమా ఫేమస్ అయిన కార్తీక్ ఆ తరువాత ‘కొత్త బంగారు లోకం’లో నిజంగా నేనేనా పాటతో మరింతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకూ పలు బాషలలో 1000 పాటలను ఆలపించాడు. నారా రోహిత్ ‘ఒక్కడినే’ సినిమాతో సంగీతదర్శకుడి అవతారమెత్తాడు.

తాజాగా బాహుబలి సినిమాలో ఒకపాటను ఆలపించిన కార్తీక్ అది రూపుదిద్దుకున్న తీరుకి తన ట్విట్టర్ పేజ్ లో హర్షం వ్యక్తం చేశాడు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు రాజమౌళి దర్శకుడు. ఈ చిత్ర మొదటిభాగం షూటింగ్ ముగించుకుని మే నెలలో విడుదలకు సిద్ధపడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు