
ఆర్ఎక్స్100 తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. వాస్తవిక సంఘటనల ఆధారంగా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను ముగించుకుంది. ఒంగోలు లో జరిగిన ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించారు. దాంతో షూటింగ్ 40శాతం కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ యూరప్ లో జరుగనుంది.
జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక కార్తికేయ ఈ చిత్రం తోపాటు నాని ‘గ్యాంగ్ లీడర్’ లో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

