
జోష్ సినిమాతో రాధ కూతిరి ట్యాగ్ తో సినిమా రంగానికి ప్రవేశించిన నటి కార్తీక. ఆ తరువాత ‘రంగం’ సినిమాతో హిట్ ని అందుకుని, దమ్ము సినిమాతో అగ్ర నాయకుల హీరోయిన్ గా చేరింది. ఆ తరువాత చాలాకాలం విరామం తీసుకుని ఈ శుక్రవారం బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాతో మనముందుకు రానుంది.
ఈ చిత్రంలో ప్రేమ్ రక్షిత్ కార్తీక చేత హీరోతో సమానంగా ఫ్లోర్ స్టెప్స్ ని వేయించారట. అమ్మ హీరోలతో పోటీపడి డ్యాన్స్ చేయడానికి చిరంజీవిగారే స్పూర్తని, తాను సైతం హీరోలతో సమానంగా డ్యాన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి సోదరిగా నటిస్తుంది. చిన్ని కృష్ణ దర్శకుడు. ఈ సినిమా నవంబర్ 7న మనముందుకు రానుంది