మళ్లీ నిఖిల్ సరసన కలర్స్ స్వాతి ?

Published on Apr 18, 2019 8:14 pm IST

వినూత్నమైన పాయింట్ తో ‘కార్తికేయ’లాంటి మంచి సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయం అయ్యాడు చందు మొండేటి. ఇక చందు మొండేటి చివరగా చేసిన ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫిస్ వద్ద అపజయాన్ని మూట్టకట్టుకుంది.

దాంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అలాగే ‘శర్వానంద్’తోనూ అప్పట్లో ఓ సినిమా చేద్దామనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం చందు తన తరువాత సినిమాను నిఖిల్ తో ‘కార్తికేయ 2’గా చేస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా ‘కార్తికేయలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి.. ‘కార్తికేయ 2’లోనూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కలర్స్ స్వాతితో పాటు సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందట. మొత్తానికి కలర్స్ స్వాతి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట.

సంబంధిత సమాచారం :