యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ‘కార్తికేయ – 2’ ట్రైలర్

Published on Jun 25, 2022 11:00 pm IST

యువ నటుడు నిఖిల్ సిద్దార్ధ దాదాపుగా ఎనిమిదేళ్ళ క్రితం నటించిన థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కార్తికేయ సూపర్ సక్సెస్ కొట్టింది. స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి చందూ మొండేటి దర్శకుడు. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా తెరక్కుతున్న కార్తికేయ 2 మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న కార్తికేయ 2 మూవీని మరింత అద్భుతంగా దర్శకుడు చందూ తెరకెక్కించారని, తప్పకుండా మూవీ రిలీజ్ తరువాత అందరి అంచనాలు అందుకుని సూపర్ హిట్ కొడుతుందని నిన్నటి ట్రైలర్ రిలీజ్ వేడుకలో తెలిపారు హీరో నిఖిల్.

ఇక నిన్నటి నుండి కార్తికేయ 2 ట్రైలర్ ఇంకా యూట్యూబ్ లో టాప్ లోనే ట్రెండింగ్ అవుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూడు మిలియన్స్ కి పైగా వ్యూస్ ని రాబట్టి అందరినీ ఆకట్టుకుంటూ దూసుకెళుతోంది. ట్రైలర్ లో యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు విజువల్స్ కూడా అదిరిపోయాయి, ముఖ్యంగా ఈ ట్రైలర్ సినిమాపై అందరిలో ఎంతో క్యూరియాసిటీని నింపిందని చెప్పాలి. యువ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఎంతో గ్రాండ్ గా నిర్మించగా, దీనిని జులై 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :